ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని టీచర్‌గా స్థిరపడాలనుకుంటున్న మీకలని CTET తీరుస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE సీటెట్‌ని నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ 2020 ఫిబ్రవరి 24 చివరి తేదీ. 2020 జుై 5న సీటెట్ నిర్వహించనుంది.
ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://ctet.nic.in/ చూడొచ్చు. సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన KVS, నవోదయ విద్యాలయ సమితి NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2020 జనవరి 24.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 ఫిబ్రవరి 24.. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2020 మార్చి 24.. పరీక్ష తేదీ: 2020 జూలై 5..
1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్ధులకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ 2 రాయాలి. 1నుంచి 8 తరగతుల వరకు బోధించాలనుకుంటే పేపర్ 1, పేపర్ 2 రెండూ రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: పేపర్ 1 లేదా పేపర్ 2 పరీక్షకు జనరల్, ఓబీసీ అభ్యర్ధులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్ధులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.600.
పేపర్ 1 రాసే అభ్యర్దులు 12వ తరగతి 50% మార్కులతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతుండాలి.
పేపర్ 2 రాసే అభ్యర్దులు డిగ్రీతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. దీంతో పాటు బీఈడీ చేసి ఉండాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.