సమత దోషులకు ఉరిశిక్ష విధించడంపై జిల్లా వ్యాప్తంగా సంబరాలు

Update: 2020-01-30 20:24 GMT

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసులో దోషులకు ఉరిశిక్ష విధించింది కోర్టు. షేక్‌ బాబా, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లకు ఉరి ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పునివ్వడంపై సమత స్వగ్రామమైన నిర్మల్‌ జిల్లా, గోసంపల్లె వాసులు సంతోషం వ్యక్తం చేశారు. సమతకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని అన్నారు. సమత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు.. సమత స్వగ్రామంతో పాటు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముగ్గురు దోషులకు సరైన శిక్ష పడిందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ఇక, జిల్లా కేంద్రంలోని కాలేజీ విద్యార్థులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

అమెరికాలోని న్యూజెర్సీలో మేకప్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన మేకప్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ వెంట్ కు మిస్ ఇండియా యూఎస్ ఏ శిరి శైనితోపాటు కళాకారులు, ఫ్యాషన్ డిజైనర్స్, ఎంటర్టైన్ మెంట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర కళాకారులకు వచ్చినంత గుర్తింపు మేకప్ ఆర్టిస్టులకు రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటితంగా ఉన్న వీరికోసం మేకప్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా సంస్థను ప్రారంభించడం అభినందించదగిన విషమన్నారు. ఆర్టిస్టులతో సమానంగా మేకప్ ఆర్టిస్టులను గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

Similar News