అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర

Update: 2020-02-05 13:43 GMT

తెలంగాణ మహాకుంభమేళ కొనసాగుతోంది. అంగరంగ వైభంగా మేడారం మహాజాతర ప్రారంభమైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు. పగిడిద్దరాజును తీసుకు వచ్చేందుకు కాలినడకన 66 కిమీటర్లు అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్తులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు.

నాలుగు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలతో మేడారం, కన్నెపల్లి గ్రామాలు కొత్త కళ సంతరించుకున్నాయి. మేడారం పొలిమేర గ్రామాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు సారలమ్మ గద్దెపైకి రావడంతో అసలు సంబరం మొదలవుతుంది. ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మ ఆగమనం కీలక ఘట్టం. నెల రోజుల నుంచే భక్తులు లక్షల సంఖ్యలో వన దేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.

Similar News