ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయ్‌టర్స్ వార్తాసంస్థ సంచలన కథనం రాసింది. ఆ సంస్థను ఉటంకిస్తూ.. ప్రముఖ వెబ్‌సైట్లు కథనాలు ఇచ్చాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం పడిపోయి... వైసీపీ సర్కార్ రావడంతో.. కియాకు కష్టాలు మొదలయ్యాయని వాటి సారాంశం. ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని చట్టం చేయడంతో పాటు.. కియా మోటార్స్‌కు ఇస్తామన్న ప్రోత్సాహకాలను సమీక్షిస్తామనడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడుకు తరలివెళ్లేందుకు.. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్టు రాశారు. ఆ సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయని.. మరో వారంలో కార్యదర్శి స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం, కియా ప్రతినిధులు ఈ వార్తల్ని ఖండించారు.