ఈ రోజు అమరావతి రైతులకు చేసిన అన్యాయం.. రేపు విశాఖ రైతులకు చేయరని నమ్మకం ఉందా?: లోకేష్
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని 55 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమంపై.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. ఆరోగ్యం విషమించినా.. రాష్ట్ర భవిష్యత్తు అయిన అమరావతిని మాత్రం ప్రజలు వదల్లేదన్నారు. పోలీసులు దీక్ష భగ్నం చేసినా.. ఆసుపత్రిలో యువకులు దీక్ష కొనసాగిస్తున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. ఆందోళనలు 55వ రోజుకు చేరినా.. జగన్ గారి మనసు కరగడంలేదన్నారు. ఇప్పుడు జగన్ గారు అమరావతి రైతులకు చేసిన అన్యాయం.. రేపు విశాఖపట్నం రైతులకు చేయరని నమ్మకం ఏమిటని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. మూడు ముక్కల రాజధాని వద్దు.. అభివృద్ధే ముద్దు అని.. అన్ని ప్రాంతాల ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. జగన్ గారికి మాత్రం ఈ విషయం అర్థంకావడం లేదని ట్వీట్ చేశారు లోకేష్.