వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు రద్దు చేసి.. పేర్లు మార్చి.. ప్రజలకు అందకుండా చేస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ నేతల విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలుపై నిప్పులు చెరిగారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పు అన్న వైసీపీ.. ఇప్పుడు వైజాగ్‌లో ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తోందని ప్రశ్నించారు.