పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. లోకేష్ అనే యువకుడ్ని కిడ్నాప్ చేసిన దుండగులు రెండు లక్షలు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను బెదిరించారు. లోకేష్‌ను భీమిలి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. అనంతరం భీమవరంలో వదిలేసి వెళ్లారు కిడ్నాపర్లు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారమే దీనికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు.