రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదముందన్నారు ఏపీ సీపీఎం కార్యదర్శి మధు. ఇప్పటికే రాజధాని మార్పుతో పెట్టుబడులు తరలిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించి.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు మరో సీపీఎం నేత బాబూరావు. అమరావతికి మద్దతుగా విజయవాడ ధర్నా చౌక్‌లో సీపీఎం చేపట్టిన 24 గంటల దీక్షకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు.