సెలెక్ట్‌ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధం : యనమల రామకృష్ణుడు

Update: 2020-02-17 16:17 GMT

సెలెక్ట్‌ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.. మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు. దీనిద్వారా శాసనపరిషత్‌ కార్యదర్శిపై చర్యలు తీసుకునే అధికారం చైర్మన్‌కు ఉందన్నారు. కార్యదర్శిపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని యనమల ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితులను.. కేంద్రానికి, రాష్ట్రానికి వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగానే తమ విధానం ఉంటుందన్నారు యనమల.

Similar News