అమరావతి రైతులకు అఖిలభారత కిసాన్ సభ మద్దతిచ్చింది. రైతుల ఉద్యమానికి తాము ఎప్పుడు అండగా ఉంటాన్నారు అఖిలభారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి విజు కృష్ణన్. రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారాయన. మంచి రాజధాని కావాలంటే 30వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో రైతుల్లా లాంగ్ మార్చ్‌కు ప్లాన్ చేస్తే.. తామూ పాల్గొంటామన్నారాయన.
తుగ్లక్ ఒక రాజధాని మారిస్తే.. అభినవ తుగ్లక్ అయిన జగన్ మూడు రాజధానులు పెడుతున్నారన్నారు మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. రాజన్న రాజ్యం తెస్తానని...చివరికి రాజారెడ్డి రాక్షస రాజ్యం తెచ్చారన్నారు. రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజావేదిక కూల్చి ఏం సాధించారని ప్రశ్నించారు. జగన్ మొండిగా వ్యవహరిస్తే ఫలితం అనుభవిస్తారన్నారు వడ్డే శోభనాధ్రీశ్వరరావు