రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రైతులు చేస్తోన్న ఉద్యమం 63వ రోజుకు చేరింది. తుళ్లూరు, వెలగపూడి, రాయపూడిలో దీక్ష శిభిరాలు కొనసాగుతున్నాయి. రాజధాని సాధించే వరకూ దీక్షలు ఆపేది లేదంటున్నారు రైతులు. సీఎం జగన్ తననిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వారు తమ దీక్ష ఆపేది లేదంటున్నారు రైతులు.
అమరావతి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. విడతల వారిగా.. దీక్షలో కూర్చొని తమ ఆందోళన రోజురోజుకు తీవ్ర తరం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించేవరకు తమ ఉద్యమం ఆగదంటున్నారు. రాజధాని మహిళా రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని.. ప్రాణంపోయినా.. రాజధానిని వదులుకోమని చెబుతున్నారు.
అటు విశాఖవాసులు కూడా అమరావతే రాజధానిగా కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖకు రాజధాని అవసరం లేదంటున్నారు వైజాగ్ మహిళలు. మంగళవారం అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన విశాఖ మహిళలు.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు. విశాఖకు రాజధాని రాకపోయినా.. మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ తననిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు విశాఖ మహిళలు.