రోజాకు అమరావతి సెగ

Update: 2020-02-20 14:15 GMT

జై అమరావతి.. సేవ్ అమరావతి నినాదాలతో మందడం మారుమోగిపోయింది. మహిళల ఆందోళనలతో ఎఆర్ఎం యూనివర్సిటీ ప్రాంగణం హోరెత్తింది. వర్సిటీలో ఓ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను రాజధాని మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

రోజా వర్సిటీకి వస్తున్నారని తెలియగానే మహిళలు, విద్యార్థులు పెద్దయెత్తున తరలివచ్చారు. వర్సిటీ లోపలికి వెళ్లిన రోజా బయటికి వచ్చేవరకు అక్కడే బైటాయించారు. గేటు ముందే ఆందోళనకు దిగారు. రోజా బయటికి వస్తున్నారని తెలియాగానే పరుగుపరుగున వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ రెండు మార్గాలను బ్లాక్ చేసి నిరసన తెలిపారు.

ప్లకార్డులు చేతపట్టుకుని జై అమరావతి నినాదాలు చేశారు మహిళలు. తమను పెయిడ్ ఆర్టిస్టులని అన్న రోజా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News