రాష్ట్రంలో సమస్యలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేశారు: సీపీఐ రామకృష్ణ
అమరావతి గ్రామాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజా సంఘాలు, విపక్షాలు మద్దతు తెలిపాయి. ఎక్కడికక్కడ జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలో సమస్యలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.