ఇలా చేస్తే.. చట్టపరమైన చిక్కులకు ఎవరు బాధ్యత వహిస్తారు: పవన్

Update: 2020-02-26 18:19 GMT

రాజధాని కోసం సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. వైసీపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూముల్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓవైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే అవుతుందన్నారు. రాజధాని భూముల్ని పేదలకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని.. ఆ తర్వాత వచ్చే చట్టపరమైన చిక్కులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అసైన్డ్ భూములు, స్మశాన భూములు, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చలని నిర్ణయించడంతోనే ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందని అన్నారు.

Similar News