బిగ్ బ్రేకింగ్.. నిర్భయ దోషులకు మంగళవారం ఉరిశిక్ష

Update: 2020-03-02 15:11 GMT

ఉత్కంఠ తొలగింది. శిక్ష అమలు కాబోతోంది. మూడోసారి డెత్‌వారెంట్‌ దోషులకు పాలిట యమపాశంగా మారుతోంది. నిర్భయ దోషులకు మంగళవారం ఉరిశిక్ష అమలు కానుంది. మరణశిక్షపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు అంగీకరించలేదు. ఉరిశిక్ష అమలును నిలిపివేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మంగళవారం ఉదయం 6 గంటలకు శిక్ష అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అక్షయ్ కుమార్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు.

అంతకుముందు, సుప్రీంకోర్టులో కూడా దోషులకు చుక్కెదురైంది. పవన్ గుప్తా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ పవన్ గుప్తా వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరణశిక్షపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. నిర్భయ ఘటన జరిగేనాటికి తాను మైనర్‌నని పవన్ గుప్తా చెప్పుకొచ్చాడు. తనకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని విజ్ణప్తి చేశాడు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. పవన్ గుప్తా కు రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించింది.

Similar News