పట్టణ ప్రగతి కార్యక్రమంతో సిద్ధిపేట రూపురేఖలు మారిపోతున్నాయి: హరీష్ రావు
పట్టణ ప్రగతి కార్యక్రమంతో సిద్ధిపేట రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు మంత్రి హరీష్ రావు. 14 వార్డులో జరిగిన పట్టణ ప్రగతికి హాజరైన మంత్రి.. హౌజింగ్ బోర్డు కాలనీలో నూతన రైతు బజార్‌ను ప్రారంభించారు. ఇప్పటికే పట్టణంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించామని.. అయితే చెత్త అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. మన ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వీధిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.