మాస్కు ధరించి ప్రశ్న అడిగిన ఎంపీ నవనీత్ రవి రానా

Update: 2020-03-05 18:18 GMT

దేశంలో కరోనావైరస్ ప్రవేశించిన తరువాత ప్రజల్లో ఆందోళన రేగిన సంగతి తెలిసిందే. ఈ భయం లోక్ సభలను కూడా ఆవహించింది. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర లోక్ సభ సభ్యురాలు నవనీత్ రవి రానా కరోనా భయంతో గురువారం లోక్సభలో మాస్కు ధరించి ప్రశ్న అడిగారు.

ఆమె తన నియోజకవర్గానికి సంబంధించి విద్యుత్ సరఫరా గురించి ప్రశ్న అడిగారు. కాగా నవనీత్ రవి రానా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలావుంటే దేశంలో కరోనావైరస్ కేసులు నమోదవుతుండటంతో, సంక్రమణను నివారించడానికి చాలా మంది ప్రజలు ముసుగులు ధరించడం ప్రారంభించారు.

Similar News