వెయ్యి కోట్లు ఖర్చుపెట్టైనా సరే.. కరోనాను ఎదుర్కొంటాం: కేసీఆర్

Update: 2020-03-07 16:44 GMT

కరోనా వైరస్‌ గురించి హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు సీఎం కేసీఆర్. ఇంతవరకు తెలంగాణలోని ఒక్క వ్యక్తికి కూడా కరోనా రాలేదని చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక్కరికి మాత్రమే ఈ వైరస్ సోకిందని.. అతడు కూడా ఇప్పుడు కోలుకుంటున్నారని అన్నారు. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టైనా సరే కరోనాను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అవసరమైతే శాసనసభ బంద్ పెట్టి.. ఎమ్మెల్యేలంతా వెళ్లి నియోజకవర్గాల్లో నిలబడుతారని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని చెప్పారు సీఎం.

Similar News