JEE అడ్వాన్స్‌డ్ 2020 బ్రోచర్‌ విడుదల

Update: 2020-03-08 14:25 GMT

JEE అడ్వాన్స్‌డ్ 2020 సమాచార బ్రోచర్‌ విడుదల అయింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో jeeadv.ac.in లో బ్రోచర్‌ ను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఢిల్లీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో విడుదల చేసిన సమాచారం ప్రకారం, JEE అడ్వాన్స్‌డ్ పరీక్షల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 2020 మే 1 నుండి ప్రారంభమయి.. మే 6 న ముగుస్తుంది. దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ మే 7, 2020. JEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామినేషన్ 2020 కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి సంబంధిత వివరాలను తెలుసుకోవాలని సూచించారు అధికారులు. కాగా ఐఐటిలలో వివిధ కోర్సులలో ప్రవేశానికి JEE (అడ్వాన్స్డ్) పరీక్ష 2020 .. కింది షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది:

తేదీ - 2020, మే 17 ఆదివారం

పేపర్ 1: ఉదయం 09:00 - మధ్యాహ్నం 12:00 గంటల వరకు

పేపర్ 2: మధ్యాహ్నం 14:30 - సాయంత్రం 17:30 గంటల వరకు

ఇదిలావుంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2020 ను ఐఐటిలలోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహిస్తారు. JEE (అడ్వాన్స్‌డ్) 2020 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు బీఈ / బిటెక్ క్లియర్ చేయాలి.

Similar News