అమరావతి చుట్టూ జగన్ సర్కారు కుట్రలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఉద్యమాన్ని అణిచివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి 3 వేల మందిపై 92కిపైగా కేసులు నమోదయ్యాయి. కొందరిని ఐదారు కేసుల్లో ఇరికించారు. 144 సెక్షన్ ఉన్నప్పుడు ర్యాలీ తీశారని, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని ఒకటేంటి.. ఏ కోణంలో వీలైతే ఆ కోణంలో కేసు పడుతోంది. వీటిని లెక్కచేయకుండానే ఉద్యమిస్తున్న రైతులు.. ఇవాళ కూడా దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇవాళ 83వ రోజు కూడా తుళ్లూరు, వెలగపూడి, మందడంలో దీక్షలు చేస్తున్నారు. పెనుమాక, కృష్ణాయపాలెం, ఉండవ్లి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, పెదపరిమిలో కూడా రైతులు నిరశనల్లో పాల్గొంటున్నారు.