మూసీ నది సుందరీకరణపై ఫోకస్ చేసిన ప్రభుత్వం

Update: 2020-03-10 11:05 GMT

మూసీ నది సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. ఇప్పటికే బడ్జెట్‌లో దీనికోసం 10వేల కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పరిస్థితులను, ప్రస్తుతం జరుగుతున్న పనులను మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి పరిశీలించారు.

మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించడం అవసరమైన ప్రాంతాల్లో ట్రాక్ నిర్మించడం మూసీకి రెండు వైపులా వెయ్యి మీటర్ల చొప్పున రోడ్లు ఏర్పాటు చేయడం, మూసీకి ఇరువైపులా పార్కులు ఏర్పాటు చేయడం కోసం పరిశీలించారు. మూసీలో అనేక ప్రాంతాలలో అక్రమంగా అధికారుల కళ్లుగప్పి వేస్తున్న మట్టి దిబ్బలను, వేస్టేజీని తక్షణం తొలగించాలని అధికారులను సుధీర్‌ రెడ్డి ఆదేశించారు.

Similar News