ఏపీలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చి ఓ యువకుడికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఉన్న బాధితుడు గత నాలుగు రోజులుగా నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు... అతనికి కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించారు. రెండో విడత పరీక్షల కోసం బాధితుడి రక్త నమూనాలను పూణె పంపించారు. ప్రస్తుతం నెల్లూరు ఆసుపత్రిలోనే ప్రత్యేక వార్డులో కరోనా బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరులోని చిన బజారులో నివసిస్తున్న బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాధితుడి నివాస ప్రాంతంలో ఉన్న వారిని కూడా అప్రమత్తం చేశారు.