సమిష్టి కృషితో కరోనా పాజిటివ్ కేసును నెగెటివ్‌గా మార్చాం: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు
సమిష్టి కృషి వల్లే కరోనా పాజిటివ్ కేసును నెగెటివ్‌గా మార్చగలిగామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ తెలిపారు. ప్రత్యేక వార్డులో ఉన్న కరోనా పాజిటివ్ రోగి.. వైద్యానికి అన్ని రకాలుగా సహకరించాడని.. త్వరలోనే అతను కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాంధీలో అందరు మూడు షిఫ్టుల్లో పని చేశారని ప్రశంసించారు. మరోసారి టెస్టు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోగిని డిశ్చార్జి చేస్తామని సూపరింటెండెంట్ శ్రావణ్‌తో తెలిపారు.