త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 191 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించామన్నారు. ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1550 బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం కేసుల్లో 33 మందిని అరెస్టు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.