కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్

Update: 2020-03-14 17:19 GMT

కరోనా పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశం అయింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఈ మీటింగ్‌లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఇద్దరిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇందులో ఒకరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. మరొకరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వీరి నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. హైలెవల్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనుంది ప్రభుత్వం.

 

Similar News