ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్

Update: 2020-03-16 23:01 GMT

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వాయిదాను సవాల్‌ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ మంగళవారం విచారణకు రావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో మంగళవారం ఎలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేసింది. రెగ్యులర్‌ పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు, ఛాంబర్ మేటర్స్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర పిటిషన్లను మాత్రం విచారణకు స్వీకరించనుంది. మధ్యప్రదేశ్‌ బలపరీక్షపై దాఖలైన పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది. అయితే ఏపీ పిటిషన్ మాత్రం ఎక్కడా లిస్ట్ కానందున దీనిపై విచారణ జరిగే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

Similar News