93వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

Update: 2020-03-19 08:28 GMT

అమరావతి ఉద్యమం మహోగ్ర రూపం దాల్చుతోంది. ఈ ఉద్యమం 93వ రోజుకు చేరింది. మహాధర్నాలు, నిరసన దీక్షలు, రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటి వరకు శాంతియుత మార్గంలోనే ఉద్యమాన్ని నడిపిస్తున్నామని.. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు.య 92 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు రాజధాని గ్రామాల ప్రజలు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అమరావతి అడుగు కూడా కదలదని అంటున్నారు. అమరావతి కోసం ఎందాకైనా వెళ్తామంటున్నారు. అవసరమైతే ప్రాణ త్యాగాలకూ సిద్ధమంటున్నారు. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో రైతుల గుండెలు ఆగిపోతున్నాయని.. అయినా, ముఖ్యమంత్రి మనసు కరగడం లేదని రైతులు, మహిళలు మండిపడుతున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, యర్రబాలెం సహా అనేక గ్రామాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నారు.

Similar News