కరోనా ఎఫెక్ట్ తో కరీంనగర్ పట్ణణంలో రెండోరోజు అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మొదటి రోజు 26 వేలమందికి స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు.. ఈరోజు మరో 26 వేల మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు. అయితే, ఇప్పటివరకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, స్క్రీనింగ్ టెస్ట్ లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ నెల 31 వరకు కరీంనగర్ నగరాన్ని మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆరోగ్య కరీంనగర్ గా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వదంతులు నమ్మకూడదని నగరవాసులకు పిలుపునిచ్చారు.