ఆదివారం ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. కరోనా గురించి ప్రజలెవరూ భయపడొద్దని, అప్రమత్తంగా ఉంటే చాలని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు పని చేస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గవర్నర్. ఆదివారం రాజ్‌భవన్ లో జనతా కర్ఫ్యూ పాటిస్తామని చెప్పారు. కరోనాకు స్వీయనియంత్రనే సరైన మందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోందని అన్నారు తమిళిసై.