తెలుగు రాష్ట్రాల్లో ఇంటి వద్దకే కూరగాయాలు

Update: 2020-03-26 09:57 GMT

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇంటికి ఒకరు చొప్పున దుకాణాలకు వెళ్లొచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా ప్రధాన రహదారుల గుండా వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు వారిని ఆపి, అనుమతించకపోవడం వంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే, ఈ అవసరం లేకుండా ప్రభుత్వం సరకులు, కూరగాయల వంటివి ఇళ్ల వద్దకే పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. గురువారం సంచార రైతు బజార్ల ద్వారా కూరగాయలను అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాటు చేస్తున్నారు. వీలును బట్టి నిత్యావసరాలను కూడా ఇళ్ల వద్దకే పంపాలని భావిస్తోంది. ఇందుకోసం పలు నగరాలు, పట్టణాల్లో మార్కెంటిగ్ శాఖ.. కూరగాయల సరఫరాకు కొన్ని వాహనాలను అందుబాటలోకి తీసుకువచ్చింది. కూరగాయలు, నిత్యావసరాలకై ప్రజలు రోడ్లపైకి రాకుండా ఉండేందుకు తెలంగాణతో పాటు ఏపీ సర్కార్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News