తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే కరోనా కేసులు నమోదయ్యాయో.. ఆయా ప్రాంతాలపై దృష్టిపెట్టారు. గ్రేటర్ హైద్రాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో సోడియం, హైట్రో క్లోరైడ్‌ను స్ప్రే చేస్తోంది. ముఖ్యంగా నగరంలో కోకాపేట్, దోమల్‌గూడ, సికింద్రాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. కరోనా వ్యాప్తి చెందకుండా స్ప్రే చేస్తున్నారు.