కేరళలో తొలి కరోనా మరణం

Update: 2020-03-28 15:42 GMT

కేరళలో తొలి కరోనా మరణం నమోదైంది. శనివారం 69 ఏళ్ళ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కొచ్చిలోని కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో మృతి చెందారు.ఆయన గత నెల దుబాయ్‌ నుంచి ఇండియాకు వచ్చారు. ఆ తరువాత కరోనా వైరస్ భారిన పడ్డారు. కానీ గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఈనెల 22న కరోనా లక్షణాల ప్రభావం మరింత ఎక్కువైంది. దాంతో కొచ్చిలోని కలమస్సేరి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతనికి

మెరుగైన చికిత్స చేస్తున్నారు.. అయినా అతడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్‌ మీద చికిత్స అందించారు. కానీ అతనికి అప్పటికే గుండెజబ్బు ఉండడం దానికి తోడు హై బీపీ రావడంతో శనివారం మరణించాడని.. కేరళ మంత్రి వి.ఎస్. సునీల్ కుమార్ కొచ్చిలో చెప్పారు. దీంతో దేశవ్యాప్త కరోనా వైరస్‌ మరణాల సంఖ్య 21కి చేరింది.

Similar News