మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

Update: 2020-03-28 17:43 GMT

మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యాంకుమార్ తన పదవికి రాజీనామా చేశారు.. అనంతరం తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించారు. కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి ఫిరాయించారు శ్యామ్ కుమార్.. దీంతో గురువారం రాజీనామా సమర్పించారు. అయితే స్పీకర్ మాత్రం ఆయన రాజీనామాను పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ కింద శ్యాంకుమార్ ను అనర్హుడిగా ప్రకటించారు. 2017 లో కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికైన తరువాత బిజెపిలో చేరారని ఇది పార్టీ లైన్ కు విరుద్ధంగా పేర్కొంటూ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News