ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న వేలాది కరోనా కేసుల నేపథ్యంలో భారత్‌లో ఇంకా కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శనివారం తెలిపింది. ‘కరోనా లక్షణాలతో ఇప్పటివరకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ (SARI) హాస్పిటల్లో చేరిన 110 మందిలో దాదాపు పదకొండు మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారు చెన్నై, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు..
అయితే ఈ ముగ్గురికి ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదు. పైగా కరోనా సోకిన వ్యక్తితోనూ వారికి ఎలాంటి సంబంధం లేదుగనుకనే కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్ అనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు.’అని ఐసీఎంఆర్ శాస్ర్తవేత్త గంగాఖేద్కర్ అన్నారు
ఏదేమైనా, ప్రస్తుతానికి భయపడటానికి ఎటువంటి కారణం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. కరోనావైరస్ పరీక్షకు కావలసిన ప్రమాణాలను వైద్య సంస్థలకు సమకూరుస్తున్నట్టు శనివారం ఐసిఎంఆర్ ప్రకటించింది. భారతదేశం ఇప్పుడు యాదృచ్ఛిక నమూనా పరీక్ష నుండి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులందరి పరీక్షలకు మార్చబోతోంది.