హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ)లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మంగళవారం నుంచి సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు అనుమతులు ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. దీంతో సీసీఎంబీ అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి సిద్ధమవుతున్నారు.