ఆపన్నులను ఆదుకునే సమయం వచ్చింది. ఎవరికి తోచిన సాయం వారు చేయండి అన్న ప్రభుత్వం పిలుపుతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ యశోదను మంత్రి కేటీఆర్ అభినందించారు. లాక్‌డౌన్ వేళ ఉచిత ఆహారసరఫరాకు చేయూతగా 100 కిలోల బియ్యం అందజేసి ఆమె తన ఉదారతను చాటుకున్నారని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు.