దేశంలో కరోనా వ్యాప్తికి.. మర్కజ్ ప్రార్థనలే కారణమని మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశవ్యాప్తంగా విధించిన జనతా కర్ఫ్యూ కన్నా ముందు జరిగిన కార్యక్రమానికి మతపరమైన రంగు పులమకుండా రాజకీయ పార్టీలు విజ్ఞతతో ఆలోచించాలని ఆయన సూచించారు.
అటు.. మర్కజ్‌లో పాల్గొన్న వారంతా స్వచ్ఛందంగా కరోనా వైద్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అవసరాన్ని బట్టి క్వారంటైన్‌లోకి వెళ్లాలని.. ప్రభుత్వమే మిమ్మల్ని గుర్తించాలంటే కష్టమని ఆయన విజ్ఞప్తి చేశారు.