మాట వినట్లేదా.. మరేం ఆలోచించకుండా కాల్చేయండి: అధ్యక్షుడు ఆదేశాలు

Update: 2020-04-02 20:48 GMT

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు బయటకు రాకుండా చూడడం ఒక్కటే మార్గం. అందుకే లాక్‌డౌన్ విధించి మరీ ప్రజల్ని కట్టడి చేస్తున్నాం. అయినా వినకుండా ఏదో ఒక అవసరం చెప్పి బయటకు వస్తున్నారు. అలా ఎవరైనా వస్తే వారిని ఆలోచించకుండా కాల్చేయండి అని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పోలీసు అధికారులను ఆదేశించారు. వైరస్ మహమ్మారిని ఎదర్కోవడానికి నిబంధనలు కఠినతరం చేసే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.

ఇక్కడి దేశ జనాభాలో 16 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్నారు. వారికి నిత్యావసర వస్తువుల పంపిణీకి 4 బిలియన్ డాలర్లు కేటాయించింది ప్రభుత్వం. అయితే వారికి వస్తు సరఫరా ఆలస్యమవుతున్న కారణంగా ప్రజలు ఆకలి కేకలతో రోడ్ల మీదకు వస్తున్నారు. అధ్యక్షుడి వ్యాఖ్యలను మానవహక్కుల సంస్థ తప్పుపడుతోంది. ప్రజలు తమ కడుపు మండిపోతుంటే మౌనంగా ఉంటారని ఎలా అనుకుంటారని ప్రశ్నిస్తున్నారు. డెలివరీ ఆలస్యం అయినప్పటికీ వేచి ఉండండి. అది మీ వద్దకు వస్తుంది. మీరు ఆకలితో ఉండరు.. ఆకలితో చనిపోరు అని డ్యూటెర్టే ప్రజలను ఉద్దేశించి అంటున్నారు. ఫిలిప్పీన్స్‌లో ఇప్పటివరకు 2,311 మంది కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి అందులో 96 మంది మరణించారు.

Similar News