ఆ దేశంలో ఇప్పుడిప్పుడే ప్రబలుతున్న కరోనా వైరస్

Update: 2020-04-04 16:09 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. దీని బారినుంచి కాపాడుకోవడానికి చాలా దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక ఈజిప్తులో కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. ఈజిప్టులో కొరోనావైరస్ కేసుల సంఖ్య మొదటిసారిగా 100 కు పైగా నమోదయింది. నిన్నటివరకు రోజువారీ కేసులు 100 లోపు మాత్రమే ఉండేవి కానీ..

మొదటిసారి 100 కు పైగా కేసులు నమోదు అవవడం ఇదే మొదటిసారి. ఈ తాజా కేసులతో ఈజిప్తులో మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 985 కు పెరిగినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి వరకూ 120 కొత్త కేసులు, కొత్తగా ఎనిమిది మరణాలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈజిప్టులో ఇప్పటివరకు 66 మంది కరోనావైరస్ నుండి మరణించారు.

Similar News