దీపం వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రధాని మోదీ

Update: 2020-04-06 08:16 GMT

కరోనా బాధితులకు మేమున్నాం అంటూ 130 కోట్ల మంది ప్రజలు సంఘీభావం ప్రకటించాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ ఇచ్చిన ఐక్యతా దీపాల కార్యక్రమం ఆదివారం విజయవంతమైంది. రాత్రి తొమ్మిదిగంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు ప్రజలు తమ వాకిళ్లు, బాల్కనీలోకి వచ్చి దీపాలు, క్యాండిళ్లు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. కొందరు టార్చిలైట్లు, మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లు వేశారు.

ఇక కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రధాని మోదీ, రాష్ట్రపతి దంపతులు, ఉపరాష్ట్రపతి దంపతులు దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాతృమూర్తి హీరాబెన్‌, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు.

 

Similar News