బిగ్‌ హిట్టర్‌ ఎడ్వర్డ్స్‌ కన్నుమూత

Update: 2020-04-06 18:01 GMT

న్యూజిలాండ్‌ క్రికెట్‌లో బిగ్‌ హిట్టర్‌గా ఖ్యాతిగాంచిన మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎడ్వర్డ్స్‌ మరణించారని న్యూజిలాండ్‌ సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్‌ను కేవలం నాలుగేళ్లు మాత్రమే ఆడిన ఎడ్వర్డ్స్‌ తన ఆటతో పించ్‌ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

కాగా న్యూజిలాండ్ తరఫున ఆరు టెస్టులు , ఎనిమిది వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన ఎడ్వర్డ్స్‌ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. 1974 మరియు 1985 మధ్య 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 1978లో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది.