డైరక్టర్ సుకుమార్‌తో అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం పుష్ప ఫస్ట్ లుక్ రిలీజై ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. బుధవారం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఎప్పుడూ లేటెస్ట్ స్టయిల్‌కి ఐకాన్‌గా ఉండే బన్నీ మాస్‌లుక్‌లో కూడా అదరగొట్టేశాడంటున్నారు ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినిమా తారలు. బన్నీ.. నీ లుక్ సూపర్ అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు స్టార్లు, డైరక్టర్లు. తనకి వర్క్ పట్ల ఉన్న డెడికేషన్‌కి హాట్సాఫ్ చెబుతున్నారు. మ్యూజిక్ డైరక్టర్లు దేవీశ్రీ ప్రసాద్, తమన్.. డైరక్టర్లు వెంకి కుడుముల, శ్రీరామ్ ఆదిత్య, మారుతి, వివి నాక్, రత్నవేలు, గుణ శేఖర్ అలాగే నటీమణులు హన్సిక, రష్మిక, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ బన్నీకి విష్ చేశారు.