లాక్‌డౌన్ అలర్ట్: ఐపీఎస్ అధికారి సైకిల్‌పై సవారీ

Update: 2020-04-09 15:22 GMT

మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు. కొంచెం సంయమనం పాటించి బుద్దిగా ఇంట్లో ఉండండి. బయటకి వస్తే వైరస్ మిమ్మల్ని కబళిస్తుంది. ప్రభుత్వం చేప్పిన సూచనలు పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడండి అని చెబుతున్నారు మధ్యప్రదేశ్ డిప్యూటీ ఇన్స్ఫెక్టర్ జనరల్ (డిఐజీ) వివేక్ రాజ్ సింగ్. సైకిల్‌పై తిరుగుతూ లాక్‌డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో పోలీస్ సిబ్బందికి కూడా డ్యూటీని సక్రమంగా చేస్తున్నారా లేదా అనే విషయాలను కూడా స్వయంగా తెలుసుకుంటున్నారు. ఒకవేళ బయటకు రావలసిన పరిస్థితి వస్తే తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలిని, మాస్కులు ధరించాలని నగర పౌరులకు సూచిస్తున్నారు. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 13 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. మరో 229 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ పరిస్థితిలో లాక్‌డౌన్ అమలును కఠినతరం చేశారు.

Similar News