కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో మంకీ అనే మరో వైరస్ వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తోంది. అసలే కర్ణాటక కరోనా ధాటికి తట్టుకోలేక విలవిల్లాడుతోంది. ఇక్కడి శివమొగ్గ జిల్లాలో 139 మందికి మంకీ జ్వరాలు రాగా.. వారిలో ముగ్గురు మృతి చెందారని జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబీ శివకుమార్ తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందించడంతో వారు కోలుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది కూడా మంకీ జ్వరం కారణంగా 400 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో 23 మంది మరణించారు. ఈ ఏడాది కూడా మళ్లీ మంకీ జ్వరాలు ప్రబలడంతో ప్రజలు కలవరపడుతున్నారు. కాగా, జిల్లాలోని అడవులలో కోతులు విస్తారంగా తిరుగుతుంటాయి. వీటి ద్వారానే మంకీ జ్వరాలు వచ్చి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోందని అధికారులు చెబుతున్నారు.