కాంగ్రెస్ పాలిత రాష్టాల సీఎంలకు చిదంబరం సూచనలు

Update: 2020-04-11 15:48 GMT

లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కాంగ్రెస్ పాలిత సీఎంలకు సూచించారు.

లాక్‌డౌన్ కారణంగా పేద ప్రజలు తమ ఉపాధి కోల్పోయారని.. వారు పొదుపు చేసుకున్న డబ్బులు కూడా అయిపోయాయని ఆయన అన్నారు. ఆహారం కోసం క్యూ లైన్లలో పేదలు నిలబడుతున్నారని, వారిని ఆదుకోడానికి 65,000 కోట్లు అవసరమవుతోందని ఆయన అన్నారు. అంత స్థాయిలో కేంద్రం దగ్గర నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు.

లాక్‌డౌన్ పొడిగింపుపై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలతో.. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో చిదంబరం కాంగ్రెస్ పాలిత రాష్టాల సీఎంలకు సూచించారు.

Similar News