శనివారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Update: 2020-04-11 09:44 GMT

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, లాక్‌డౌన్‌పై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు లాక్‌డౌన్‌ను పొడగించే అంశం, వలస కార్మికులు.. అదేవిధంగా వ్యవసాయం కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కి చేరింది. అలాగే కరోనాతో 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Similar News