రాజస్థాన్‌లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. ఒక్క ఆదివారమే కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 751కి చేరింది. కరోనాపై మీడియాకు సమాచారమందించిన రాజస్థాన్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రోహిత్ కుమార్ ఈరోజు మొత్తం 8 జిల్లాల నుంచి 51 కేసులు వచ్చాయని తెలిపారు. కొత్తగా వచ్చిన కేసుల్లో జైపుర్, బాన్స్‌వారా జిల్లాల నుంచి 15 చొప్పున నమోదవ్వగా.. అటు జోధ్‌పూర్, బికనీర్ జిల్లాల నుంచి 8 కేసుల చొప్పున నమోదైనట్లు వెల్లడించారు. పంజాబ్ రాజధాని జైపుర్‌లో కరోనా ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ అత్యధికంగా 316 కేసులు నమోదయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికే ఈ స్థాయిలో కేసులు నమోదవ్వటంతో అధికారిక వర్గాల్లో ఆందోళన మొదలైంది.