కరోనా మహమ్మారి బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి సామన్యుడు నుంచి సెలబ్రిటీలకు వరకు అంందరినీ గజగజవణికిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డి ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు కమెడియన్లు కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ కన్నుమూశారు. 75 ఏళ్ల బ్రూక్ టేలర్ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.