లాక్‌డౌన్ పొడిగించటంతో రైల్వే శాఖ కీలక ప్రకటన

Update: 2020-04-14 15:08 GMT

ప్రధాని మోదీ ప్రసంగం తరువాత రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమౌతాయని అంతా భావించారు. దీనికి తగ్గట్టుగా పలువురు రిజర్వేషన్ కూడా చేసుకున్నారు. అయితే మే 3 వరకూ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే క్లారిటీ ఇచ్చింది.

Similar News