హాస్పిటల్‌కి కానీ, అర్జంట్‌గా ఇంకెక్కడికైనా వెళ్లాలంటే క్యాబ్‌లు, ఆటోలు ఏవీ అందుబాటులో లేవు. దీంతో నగర జీవులు నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అత్యవసర అవసరాలకోసం అలైట్ క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్- హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ సర్వీసులను మంగళవారం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. క్యాబ్ సర్వీసులు ఉపయోగించుకున్న వారినుంచి ఎలాంటి చార్జి వసూలు చేయరని, లాక్‌డౌన్ కొనసాగే వరకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 10 క్యాబ్‌లను అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైన వారు డయల్ 100 లేదా 8433958158 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.